సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చంచలపడగ వద్దు సారె సారె గోరవద్దు
టైటిల్: చంచలపడగ వద్దు సారె సారె గోరవద్దు
పల్లవి:
చంచలపడగ వద్దు సారె సారె గోరవద్దు
పొంచుకున్న దైవమే బుద్దులు నేర్పీని
లోకరక్షకుడు నాలోననే వున్నాడిదే
నాకు నభయములిచ్చి నన్ను గాచుమ
శ్రీకాంతు డీతడే నాచిత్తములొ మలసీని
దాకొని శుభములెల్లా దానే వొసగును
చంచ
చరణం:పరపురుషుడు నాప్రాణనాథుడైనాడు
పరగ నాపాలివాడై బ్రదికించును
ధరణీశు డీతడే నాదాపుదండైల్ కడగీని
నిరతి నేపొద్దును మన్నించును మమ్మెపుడు
చంచ
చరణం:శ్రీ వేంకటేశుడు నా జిహ్వ దగిలి వున్నాడు
పావనుని జేసి నాకు ఫల మిచ్చును
గోవిందు డీస్వామి నన్ను గొలిపించుకొన్నవాడు
యీవలనావల నాకు నిహపరా లిచ్చును
చంచ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం