సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూచే చూపొకటి సూటి
టైటిల్: చూచే చూపొకటి సూటి
పల్లవి:
ప|| చూచే చూపొకటి సూటి గురి యొకటి | తాచి రెండు నొకటైతే దైవమే సుండీ ||
చరణం:చ|| యేనుగ దలచితే యేనుగై పొడచూపు | మాను దలచిన నట్టే మానై పొడచూపు |
పూని పెద్దకొండ దలపోయ గొండై పొడచూపు | తానే మనోగోచరుడు దైవమే సుండీ ||
చ|| బట్టబయలు దలచ బయలై పొడచూపు | అట్టె యంబుధి దలచ నంబుధియై పొడచూపు |
పట్టణము దల్చిన పట్టణమై పొడచూపు | తట్టి మనోగోచరుడు దైవమే సుండీ ||
చ|| శ్రీ వేంకటాద్రిమీది శ్రీపతి దలచితేను | శ్రీవేంకటాద్రిమీది శ్రీపతై పొడచూపు |
భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ | తావు మనోగోచరడు దైవమే సుండీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం