సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూడ జూడ మాణిక్యాలు
పల్లవి:

చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
యీడులేని కన్నులెన్నులవె యినచంద్రులు ||

చరణం:

కంటి గంటి వాడె వాడె ఘనమైనముత్యాల
కంటమాలలవే పదకములు నవె
మింటిపొడవై నట్టిమించుగిరీటం బదె
జంటల వెలుగు శంఖచక్రాలవె ||

చరణం:

మొక్కు మొక్కు వాడె వాడె ముందరనే వున్నాడు
చెక్కులవే నగవుతో జిగిమోమదె
పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె
చక్కనమ్మ అలమేలు జవరాలదె ||

చరణం:

ముంగైమురాలును నవె మొల కఠారును నదె
బంగారునిగ్గులవన్నె పచ్చబట్టదె
ఇంగితమెరిగి వేంకటేశుడిదె కన్నులకు
ముంగిట నిధానమైన మూలభూత మదే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం