సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: చూడరమ్మ సతులారా
పల్లవి:

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||

చరణం:

శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి ||

చరణం:

కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరియేమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి ||

చరణం:

అమరవందితయట అట్టే మహిమయేమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం