సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూడరమ్మ యిటువంటి
పల్లవి:

చూడరమ్మ యిటువంటి సుదతులుతులేరెందు |
యేడనైన నిటువంటి యింతులు వుట్టుదురా ||

చరణం:

ముదిత నడపులలోని మురిపెమే వెయిసేసు |
కొదమ గుబ్బల తీరు కోటివేలు సేసు |
సుదతి బిత్తరిచూపు సొన్నటంకాలే సేసు |
అదర బింబము తీరు ఆరువేలు సేసు ||

చరణం:

సన్నపు నడుములోని సైకమే లక్ష సేసు |
పన్నుగా బిరుదు వన్నె పదివేలు సేసు |
యెన్నిక మెఱుగుదొడలెంత ధనమైనజేసు |
నున్నగా దువ్వినకొప్పు నూరువేలు సేసునే ||

చరణం:

అంగన భాగ్యమెట్టిదో అతిమోహమై తిరు- |
వెంగళరాయనికృప వేవేలు సేసునే |
బంగారు చవికెలోబడతి గూడిన సొంపు |
రంగుగా జెలియరూపు రాజ్యమెల్లజేసునే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం