సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూడరమ్మా చెలులాల సుదతి
టైటిల్: చూడరమ్మా చెలులాల సుదతి
పల్లవి:
ప|| చూడరమ్మా చెలులాల సుదతి చక్కదనాలు | కూడుకొన్న పతి కాంతి గురులే పోలెను ||
చరణం:చ|| మొగము చందురు బోలె ముంచిన యీ యిందిరకు | తగిన తోడ బుట్టుగా నాతడే కనక |
నగ నమృతము బోలె నలినాక్షి కదియును | తగిన పుట్టిన యింటి ధనమే కనక ||
చ|| సతి గుణ మింతాను సముద్రమునే పోలె | తతి నాతడీకెకు తండ్రి గనక |
మితిగా గన్నులు గండు మీసముల బోలె నవి | గతి గూడి తమ వారి కడవే కనక ||
చ|| తరుణి పాదాలు కల్పతరువు చిగురు బోలె | పరగగ దనవెను బల మంటాను |
గరిమ శ్రీ వేంకటేశు గైకొని పెండ్లాడి యీపె | సరవు లాతని బోలె సరసుడంటాను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం