సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూడు డిందరికి సులభుడు
టైటిల్: చూడు డిందరికి సులభుడు
పల్లవి:
ప|| చూడు డిందరికి సులభుడు హరి- | తోడునీడయగుదొరముని యితడు ||
చరణం:చ|| కైవల్యమునకు గనకపుతాపల- | త్రోవై శ్రుతులకు దుదిపదమై |
పావన మొకరూపమై విరజకు | నావైయున్నాడిదె యితడు ||
చ|| కాపాడగ లోకములకు సుజ్ఞాన- | దీపమై జగతికి దేజమై |
పాపా లడపగ భవపయోధులకు | తేపైయున్నాడిదే యితడు ||
చ|| కరుణానిధిరంగపతికి గాంచీ- | వరునకు వేంకటగిరిపతికి |
నిరతి నహోబలసృకేసరికి ద- |త్పరుడగు శఠగోపముని యితడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం