సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూడవమ్మ యశోదమ్మ
టైటిల్: చూడవమ్మ యశోదమ్మ
పల్లవి:
ప|| చూడవమ్మ యశోదమ్మ | వాడ వాడల వరదలివిగో ||
చరణం:చ|| పొంచి పులివాలు పెరుగు | మించు మించు మీగడలు |
వంచి వారలు వట్టిన | కంచపుటుట్ల కాగులివో ||
చ|| పేరీ బేరని నేతులు | చూరల వెన్నల జున్నులును |
ఆరగించి యట నగుబాళ్ళు | పార వేసిన బానలివిగో ||
చ|| తెల్లని కను దీగల సోగల | చల్ల లమ్మేటి జవ్వనుల |
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి | కొల్లలాడిన గురుతు లివిగో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం