సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూడవయ్య నీసుదతి
టైటిల్: చూడవయ్య నీసుదతి
పల్లవి:
ప|| చూడవయ్య నీసుదతి విలాసము | వేడుకకాడవు విభుడవు నీవు ||
చరణం:చ|| పున్నమివెన్నెల పోగులు వోసి | సన్నపు నవ్వుల జవరాలు |
వన్నెల కుంకుమ వసంత మాడే | ఇన్నిటా కళలతో ఈ మెరుగుబోడి ||
చ|| పాటించి తుమ్మెద పౌజులు దీర్చీ | కాటుక కన్నుల కలికి యిదే |
సూటి జక్కవల జోడలరించీ | నాటకపు గతుల నాభి సరసి ||
చ|| అంగజురథమున హంసలు నిలిపి | కంగులేని ఘన గజగమన |
ఇంగితపు శ్రీవేంకటేశ నిన్నెనసె | పంగెన సురతపు పల్లవాధరి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం