సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చూతమే యీ సంతోసాలు
టైటిల్: చూతమే యీ సంతోసాలు
పల్లవి:
ప|| చూతమే యీ సంతోసాలు సొరిదినుండి | ఐతేనేమే సవతుల మది మనమేలే||
చరణం:చ|| సతి తిట్టులతనికి చవులై వుండగాను | మతిలోన వగవగ మనకేల |
యితవై యీపె గుంపెన కితడు లోగుచుండగా | కుతిల కుడువ నేలే కొమ్మలాల మనము ||
చ|| ఆపెసేసే ఉద్దండాలు ఆతడోరుచుకుండగా | కోపమేలే మనకును కోపులనుండి |
వోపి యాలియాజ్ఞ మగడొట్టి జవదాటడు | ఆపసోపాలేలే మనమందరిలో వారము ||
చ|| కొంగాపెవట్టి తియ్యగా కూచుండాతడు లోగాగా | పంగించనేలే మనము పలుమారును |
యెంగిలిమోవిచ్చె నాపె యెనసి శ్రీ వేంకటేశు | డంగదేలేయేలిద్దరట్టే మనములను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం