సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దైవకృతంబట చేతట
టైటిల్: దైవకృతంబట చేతట
పల్లవి:
ప|| దైవకృతంబట చేతట తనకర్మాధీనంబట | కావలసినసౌఖ్యంబులు గలుగక మానీనా ||
చరణం:చ|| ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులు | యెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినది |
యెక్కడిమోహవిడంబన యెక్కడియాశబంధము | యెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా ||
చ|| యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలు | యీకోరికె లీతలపులు యిట్టే వుండీనా |
యీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనై | యీకల్మషముల బొరలగ నివి గడతేరీనా ||
చ|| దేవశిఖామణి తిరుమల దేవునికృపగల చిత్తము | పావనమై దురితంబుల బాయక మానీనా |
ఆవిభుకరుణారసమున నతడే తను మన్నించిన | ఆవేడుక లీవేడుక లాసలు సేసీనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం