సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దైవమా నీకు వెలితా
టైటిల్: దైవమా నీకు వెలితా
పల్లవి:
ప|| దైవమా నీకు వెలితా తలపువెలితేకాక | వేవేలు కర్మల వేసారగవలనె ||
చరణం:చ|| హరియంటే బాపేటి అన్నిపాపాలు సేసిన | పొరినందుపై నమ్మిక పుట్టుదుగాక |
నరసింహాయంటే వచ్చే నానాపుణ్యాలకు | తిరముగా ఋణములు దీర్చుకొనగలనా ||
చ|| దేవ జగన్నాథయంటే తెగనిజన్మములేవి | కైవశము నామనసు గాదుగాక |
గోవిందయనియంటే గూడని పదవులేవి | కావిరిగాలమూరకె కడపేము నేము ||
చ|| వేదనారాయణయంటే వీడేటి బంధములు | ఆదిగా మూడులోకాలనైనా నున్నదా |
శ్రీదేవిపతియైన శ్రీవేంకటేశ్వరుడా | యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం