సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దైవము నీవే గతి
టైటిల్: దైవము నీవే గతి
పల్లవి:
ప|| దైవమా పరదైవమా | యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో ||
చరణం:చ|| పాపకర్ముని దెచ్చి పరమియ్యదలచిన | మేపులకే పోక మెయికొనీనా |
తీపులు రూపులు దివిరి నావెనువెంట- | నేపొద్దు నీవేడ దెచ్చేవో ||
చ|| అధమాధముని దెచ్చి యధికుని జేసేనంటే | విధినిషేధములు వివరించునా |
నిధినిధానములు నిచ్చనిచ్చలు బెక్కు- | విధముల నెటువలె వెదచల్లెదవో ||
చ|| అతికష్టుడగునాకు నలవిగానియీ- | మత మొసగిన నేను మరిగేనా |
ప్రతిలేని వేంకటపతి నీదునామా- | మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం