సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దైవము పుట్టించినట్టి
టైటిల్: దైవము పుట్టించినట్టి
పల్లవి:
ప|| దైవము పుట్టించినట్టి తనసహజమే కాక | కోవిదునికైనా జాలిగుణమేల విడుచు ||
చరణం:చ|| ఆరయ బంచదార నద్దుక తినబోతే | చేరరానిముష్టిగింజ చేదేల మాను |
సారమైన చదువులు సారె సారె జదివినా | గోరపుదుష్టునికి కోపమేల మాను ||
చ|| నిప్పు దెచ్చి వొడిలోన నియమాన బెట్టుకొంటే | యెప్పుడును రాజుగాక యిది యేల మాను |
ముప్పిరి బాతకుడైనమూఢు డెన్నియాచారాలు | తప్ప కెంతసేసినాను దయయేల కలుగు ||
చ|| యింటిలోన గొక్కు దెచ్చి యిరవుగ బెట్టుకొంటే | దంటయై గోడలు పడదవ్వ కేలమాను |
గొంటరై శ్రీవేంకటేశు గొలువకుండినవాడు | తొంటిసంసా రవుగాక దొర యేటికౌను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం