సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేహము దా నస్థిరమట
టైటిల్: దేహము దా నస్థిరమట
పల్లవి:
ప|| దేహము దా నస్థిరమట దేహి చిరంతనుడౌనట | దేహపుమోహపుసేతలు తీరుట లెన్నడొకో ||
చరణం:చ|| కన్నుల బుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల | కన్నులు మనసును దనియక గాసిబడిరి జనులు |
తన్నిక నెరుగుట లెన్నడు తలపుల దొలగుట లెన్నడు | తిన్ననిపరవశములచే దిరుగుట లెన్నడొకో ||
చ|| సిగ్గులుదొలగనియాశల జిక్కికదా దుర్మానపు- | సిగ్గులయెగ్గులచేతను చిక్కువడిరి జనులు |
సిగ్గులు దొలగుట యెన్నడు చిత్తములోనౌటెన్నడు | తగ్గులమొగ్గులసేతలు తలగుట లెన్నడొకో ||
చ|| మనసునబుట్టినయాతడు మనసున బెనగొని తిరుగగ | మనసే తానగుదైవము మరచిరి యందరును |
అనయము తిరువేంకటపతి యాత్మ దలచి సుఖింపుచు | ఘనమగు పరమానందము కలుగుట లెన్నడొకో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం