సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవ నీమాయతిమిర
టైటిల్: దేవ నీమాయతిమిర
పల్లవి:
ప|| దేవ నీమాయతిమిర మెట్టిదో నా- | భావము చూచి గొబ్బన గావవే ||
చరణం:చ|| వెడదుఃఖమపుడెల్ల వేసరుచుండుదుగాని | తడవి విరతిబొంది తలగలేను |
అడియాసల దిరిగి అలయుచుండుదుగాని | మడి దొసగుల నివి మానలేను ||
చ|| హేయము స్త్రీసుఖమని యెరుగుచుండుదుగాని | పాయపుమదముచేత బాయలేను |
పాయనిపాపాలు చూచి భయమందుచుందుగాని | వోయమ్మ యివి సేయకుండలేను ||
చ|| కలకాల మిన్నియును గందువిందు గానిమరి | యెలమి నొక్కటనైన యెచ్చరలేను |
బలిమి శ్రీవేంకటేశ బంధముక్తుని జేసి | తలపులో నెలకొని దయజూడవయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం