సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవ యీ తగవు
టైటిల్: దేవ యీ తగవు
పల్లవి:
ప|| దేవ యీ తగవు దీర్చవయ్యా | వేవేలకు నిది విన్నపమయ్యా ||
చరణం:చ|| తనువున బొడమినతతి నింద్రియములు | పొనిగి యెక్కడికి బోవునయా |
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో | యెనగొని యెక్కడి కేగుదురయ్యా ||
చ|| పొడుగుచు మనమున బొడమిన యాసలు | అదన నెక్కడికి నరుగునయా |
వొదుగుచు జలములనుండు మత్స్యములు | పదపడి యేగతి బాసీనయ్యా ||
చ|| లలి నొకటొకటికి లంకెలు నివే | అలరుచు నేమని యందునయా |
బలు శ్రీవేంకటపతి నాయాత్మను | గలిగితి వెక్కడి కలుషములయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం