సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవదేవోత్తముని తిరుతేరు
టైటిల్: దేవదేవోత్తముని తిరుతేరు
పల్లవి:
ప|| దేవదేవోత్తముని తిరుతేరు | దేవతలు గొలువగా తిరుతేరు ||
చరణం:చ|| తిరువీధి లేగీని తిరుతేరు | తిరుపు గొన్నట్లాను తిరుతేరు |
తెరలించె దనుజుల దిరుతేరు | తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు ||
చ|| ధిక్కరించీ మోతల దిరుతేరు | దిక్కరి కుంభాలదర దిరుతేరు |
తిక్కు ముత్తేల కుచ్చుల తిరుతేరు | తెక్కుల బ్రతాపించీ తిరుతేరు ||
చ|| తీరిదె గలకలెల్ల దిరుతేరు | ధీర గరుడవాహపు దిరుతేరు |
చేరి యలమేలుమంగతో శ్రీ వేంకటేశ్వరుని | తీరున నెలకొన్నట్టి తీరుతేరు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం