సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: దేవదేవు డెక్కెనదె
పల్లవి:

దేవదేవు డెక్కెనదె దివ్యరథము |
మావంటివారికెల్ల మనోరథము ||

చరణం:

జగతి బాలులకై జలధులు వేరజేసి |
పగటున దోలెనదె పైడిరథము |
మిగులగ గోపగించి మెరయురావణమీద |
తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము ||

చరణం:

దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకు |
బక్కన మరలిచె బుష్పరథము |
నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె |
వెక్కసపు రెక్కలతో విష్ణురథము ||

చరణం:

బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె |
అలయేగుబెండ్లి కల్యాణరథము |
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి |
కలకాలమును వేగె ఘనమైనరథము ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం