సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవరగుణములు దెలియవు
టైటిల్: దేవరగుణములు దెలియవు
పల్లవి:
ప|| దేవరగుణములు దెలియవు | నీవే మాకును నేరుప వయ్యా||
చరణం:చ|| వదలక నీతో వాసికి బెనగిన | యెదుటనె నీ మన సెట్టుండునో |
కదిసి నీరీతికి గడు దమకించిన | యిది వేసాలని యెంతువో నీవు ||
చ|| చెనకగ నీ యెడ సిగ్గులు నెరపిన | పనులవి యేమని భావింతువో |
ననిచి నీ యెదుట నవ్వులు నవ్విన | తనివి లేనిదని తగ నాడుదువో ||
చ|| కూడుదు నిన్నిట గుబ్బల నొత్తిన | వోడ దనుచు గో రూదుదువో |
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి | వీడెమిచ్చితే వెరగందుదువో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం