సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవశిఖామణి దివిజులు
టైటిల్: దేవశిఖామణి దివిజులు
పల్లవి:
ప|| దేవశిఖామణి దివిజులు వొగడగ | వేవేలు గతుల వెలసీ వాడే ||
చరణం:చ|| వీధుల వీధుల వెసతురగముపై | భేదిల బల్లెము బిరబిర దిప్పుచు |
మోదము తోడుత మోహన మూరితి | ఏ దెస జూచిన నేగీ వాడే ||
చ|| కన్నులు దిప్పుచు కర్ణములు కదల | సన్నల రాగెకు చౌకళింపుచును |
అన్నిటా తేజియాడగ దేవుడు | తిన్నగ వాగేలు తిప్పీవాడే ||
చ|| వలగొని దిరుగుచు వాలము విసరుచు | నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ |
బలు శ్రీ వేంకటపతి అహోబలపు | పొలమున సారెకు పొదలీవాడే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం