సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవశిఖామణివి దిష్టదైవమవు
పల్లవి:

ప : దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
ఈవల నీబంట నాకు నెదురింక ఏది

చరణం:

చ : కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ

చరణం:

చ : ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను
మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి
వంచించ కడమయేది వసుధాధీశ

చరణం:

చ : తగనొక్క చింతామణి తలచినట్లచేసు
మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొరతేది జగదేకవిభుడ

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం