సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవుడుగలవారికి దిగులు
టైటిల్: దేవుడుగలవారికి దిగులు
పల్లవి:
ప|| దేవుడుగలవారికి దిగులు జింతయు లేదు | శ్రీవిభుడే అన్నిటా రక్షించుగనక ||
చరణం:చ|| యేలికగలబంటుకు యేవిచారములేదు | వోలి మగడుగలాలికి వొప్పమి లేదు |
పోళిమి దండ్రిగలపుత్రుని కంగద లేదు | మేలుగా బండినభూమికి గరవులేదు ||
చ|| బలముగలరాజుకు భయమేమియు లేదు | కలిమిగలవాని కక్కర లేదు |
యిల నాచారవంతుని కేపాపమును లేదు | తలపుబుణ్యముగల ఆతనికి జేటు లేదు ||
చ|| గురువుగలవానికి గొఱత యేమియు లేదు | పరముగలవానికి భ్రాంతులు లేవు |
యిరవై శ్రీవేంకటేశు డిన్నిటా మాకు గలడు | అరయ దాసులము మా కడ్డాకే లేదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం