సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దేవునికి దేవికిని తెప్పల
టైటిల్: దేవునికి దేవికిని తెప్పల
పల్లవి:
ప|| దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ | వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా ||
చరణం:చ|| ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు | అర్మిలి నాలుగువేదాలదె నీ దరులు |
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు | కూర్మము నీ లోతు వోకోనేరమ్మా ||
చ| తగని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు | జగతి దేవతలు నీ జల జంతును |
గగనపు బుణ్యలోకాలు నీ దరిమేడలు | మొగి నీచుట్టు మాకులు మునులోయమ్మా ||
చ|| వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము | చేకొను పుణ్యములే నీ జీవభావము |
యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి | దీకొని నీ తీర్థమాడితిమి కావవమ్మా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం