సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ధృవవరదా సంస్తుతవరదా
టైటిల్: ధృవవరదా సంస్తుతవరదా
పల్లవి:
ప|| ధృవవరదా సంస్తుతవరదా | నవమైనయార్తుని నను గావవే ||
చరణం:చ|| కరిరాజవరదా కాకాసురవరదా | శరణాగతవిభీషణవరదా|
సిరుల వేదాలు నిన్ను జెప్పగా వినీని | మరిగి మఱుగుచొచ్చే మమ్ము గావవే ||
చ|| అకౄరవరదా అంబరీషవరదా | శక్రాదిదివిజనిచయవరదా |
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు | చక్రధర శరణంటి సరి గావవే ||
చ|| ద్రౌపదీవరదా తగ నర్జునునివరదా | శ్రీపతీ ప్రహ్లాదిశిశువరదా |
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుడు | చూపగా గొలిచే నచ్చుగ గావవే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం