సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దిబ్బలు వెట్టుచు
టైటిల్: దిబ్బలు వెట్టుచు
పల్లవి:
ప|| దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||
చరణం:చ|| అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||
చ|| పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||
చ|| తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం