సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దిక్కిందరికినైనదేవుడు
టైటిల్: దిక్కిందరికినైనదేవుడు
పల్లవి:
ప|| దిక్కిందరికినైనదేవుడు కడు | దెక్కలికాడైనదేవుడు ||
చరణం:చ|| కొత్తపెండ్లికూతు గోరి చూడబోయి | యెత్తి తేరిమీద నిడుకొని |
నెత్తికన్ను మానినవాని పెండ్లికి | దెత్తిగొన్న యట్టి దేవుడు ||
చ|| గొప్పయిన పెద్దకొండమీద నుండి | దెప్పరముగా దిగబడి |
కప్పి రెండుదునుకలు గూడినవాని | తిప్పుదీరులాడే దేవుడు ||
చ|| బెరసి మేనమామబిడ్డకునై పోయి | నిరతంపుబీరాలు నెరపుచు |
యిరవైనమాయపుటెద్దుల బొరిగొన్న- | తిరువేంకటగిరిదేవుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం