సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దండనున్న చెలుల
టైటిల్: దండనున్న చెలుల
పల్లవి:
ప|| దండనున్న చెలుల మిందరము సాక్షి | నిండు దొర యీతనికి నేరమేమి లేదు ||
చరణం:చ|| వట్టి చలములుమాని వాకిలి దెరవరాదా | యిట్టె విభుడు వచ్చి యీడనున్నాడు |
వొట్టినట్టు కొలువై వుండిన దొక్కటేకాని | నెట్టన నితని వల్ల నేరమేమి లేదు ||
చ|| దిచ్చరి కోపము మాని తెర దియ్యరాదా | చొచ్చి వచ్చి రమణుడు చూచీ నిదే |
అచ్చముగ సరసము లాడిన దొక్కటే కాని | నిచ్చలు నితని వల్ల నేరమేమీ లేదు ||
చ|| పంతపు వేసాలు మాని పయ్యె దెడలించరాదా | చెంత శ్రీ వేంకటేశుడు చేయిచాచీనీ |
యింతలోన నిన్నుగూడె నిదియొక్కటే గాని | నింతము సేసలితని నేరమేమీ లేదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం