సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దోమటి వింతెరుగరా
టైటిల్: దోమటి వింతెరుగరా
పల్లవి:
ప|| దోమటి వింతెరుగరా తొల్లిటివారు | వామదేవవసిష్ఠవ్యాసాదులు ||
చరణం:చ|| తానే దైవమైతే తపమేల జపమేల | పూని సారె బూజించేపూజలేల |
కూనువంగి యింటింట గోరనేల వేడనేల | యీనెపాన లోకమెల్లా నేలరాదా తాను ||
చ|| తగ దా స్వతంతుడైతే దరిద్రదుఃఖములేల | నొగలి వ్యాధులచేత నొవ్వనేల |
నగుబాటులైన జననమరణములేల | ముగురువేల్పులదండ మొనచూపరాదా ||
చ|| శ్రీ వేంకటేశుడే శేఖరపుదైవమని | సావధాను డితనికి శరణుజొచ్చి |
భావములోపల దనపాపబంధములు బాసి | తావుల నాతనికృప దండ చేరరాదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం