సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దొరకెగా పూజ కందువ
టైటిల్: దొరకెగా పూజ కందువ
పల్లవి:
ప|| దొరకెగా పూజ కందువ పూజ నీ | విరహపు తనుతావి విరవాది పూజ ||
చరణం:చ|| కలికి నీ కనుచూపు కలువరేకుల పూజ | లలన నీ నగవు మొల్లల పూజ |
తలపోత చింత చిత్తపు గమలపు పూజ | చలివేడి వూర్పు నీ సంపంగి పూజ ||
చ|| కనుల జెక్కిన జేయి కరపల్లవపు పూజ | తను పులకలు జాజి ననల పూజ |
తనరు నీ వలపులు దొంతర పూవుల పూజ | యెనయు జెమట మల్లె మొగ్గల పూజ ||
చ|| చెనకు నీగోళ్ళే చిరి గేదగుల పూజ | గునియు గుబ్బలు పూవు గుత్తుల పూజ |
ఘనతమై గూడి వేంకటపతి మోము సో- | కిన నీదు మోవి మంకెన పూవు పూజ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం