సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దొరకునా యితనికృప
టైటిల్: దొరకునా యితనికృప
పల్లవి:
ప|| దొరకునా యితనికృప తుదిపదంబు | అరిదివిభవము లొల్లమనినా బొదలు ||
చరణం:చ|| సొంపలర నితడు కృపజూచు టరుదనికాక | యింపు సామాన్యమా యితనికరుణ |
లంటమైనఘనమైన లక్ష్మీకటాక్షములు | సంపదలు తోడనే చల్లువెదలాడు ||
చ|| తగ నితనిపై భక్తి తగులు టరుదనికాక | నగుట సామాన్యమా ననిచి యితడు |
జగదేకహితములుగ సరసతలు సౌఖ్యములు | దిగులువాయగ నితడు దిప్పు దీరాడు ||
చ|| తిరువేంకటాద్రి సిద్ధించు టరుదనికాక | మరుగ దను నిచ్చునా మరియొకరిని |
యిరవైన భోగములు యిష్టసామ్రాజ్యములు | విరివిగొని యితనిదయవెంటనే తిరుగు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం