సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ద్రువవరదా సంస్తుతవరదా
టైటిల్: ద్రువవరదా సంస్తుతవరదా
పల్లవి:
ద్రువవరదా సంస్తుతవరదా
నవమైనయార్తుని నన్ను గావవే
కరిరాజవరదా కాకాసురవరదా
శరణాగతవిభీష్ణవరదా
సిరుల వేదాలు నిన్ను జెప్పగా వినీని
మరిగి మఱుగుచొచ్చే మమ్ము గావవే
అక్రూరవరదా అంబరీషవరదా
చరణం:శక్రాదిదివిజనిచయవరదా
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు
చక్రధర శరణంటి సరి గావవే
చక్రధర శరణంటి సరి గావవే
ద్రౌపదీవరదా తగ నర్జునవరదా
శ్రీపతీ ప్రహ్లాదిశిశువరదా
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుడు
రూపగా గొలిచే నచ్చుగ గావవే
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం