సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: దురితదేహులే తొల్లియును
టైటిల్: దురితదేహులే తొల్లియును
పల్లవి:
ప|| దురితదేహులే తొల్లియును శ్రీ- | హరి భజించి నిత్యాధికులైరి ||
చరణం:చ|| అనంతకోటి మహామునులు ఈ- | సనకాదులు నిశ్చలయశులు |
ఇనశశినయనుని నితనిని మును- | గని భజించి గతకల్మషులైరి ||
చ|| అతిశయమతులు మహామహులు సుఖ- | రతివిముఖులును చిరంతనులు |
హితవిచారమతి నితనిని స- | తతమును భజించి ధన్యులైరి ||
చ|| దేవతాధిపులు దివ్యులును కడు- | బావనులును తగ బరహితులు |
యీవేంకటపతి నితనిని | సేవించి సుఖాంచితమతులైరి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం