సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎచ్చోటికేగిన యెప్పుడూ
పల్లవి:

ఎచ్చోటికేగిన యెప్పుడూ దమలోని
మచ్చిక పెనుదెవులు మానకపోయె ||

చరణం:

పాయపు సతుల గుబ్బల పెదపొట్లాల
కాయము వడి నొత్తి కాచగాను
రాయిడిచే ఘనమాయగాని లోని
మాయపు పెనుదెవులు మానకపోయె ||

చరణం:

అతివల మోహపుటధరామృతములు
యితవుగ నోరి కందియ్యగను
అతిమోహమే ఘనమాయగాని లోని
మతకరి పెనుదెవులు మానకపోయె ||

చరణం:

తరుణుల మేనిమెత్తని పరపులమీద
నిరవుగ నిటు సుఖియించగను
తిరువేంకటాచలాధీశు కృపచేగాని
మరుచేతి పెనుదెవులు మానకపోయ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం