సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏ పురాణముల నెంత వెదికినా
పల్లవి:

ఏ పురాణముల నెంత వెదికినా |
శ్రీపతి దాసులు చెడరెన్నడును ||

చరణం:

హరి విరహితములు అవిగొన్నాళ్ళకు |
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు |
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

చరణం:

కమలాక్షుని మతిగానని చదువులు |
కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు |
విమలములేకాని వితథముగావు ||

చరణం:

శ్రీవల్లభుగతి జేరనిపదవులు |
దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు |
పావనము లధిక భాగ్యపు సిరులు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం