సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏదాయనేమి హరి
పల్లవి:

ప : ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిల రక్షకుండు

చరణం:

చ : శునకము బతుకును సుఖమయ్యే తోచుకాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు

చరణం:

చ : పుఱువుకుండే నెలవు భువనేశ్వరమైతోచు
పెరచోటి గుంటయైన ప్రియమైయుండు
ఇరవై వుండితే చాలు ఎగువేమి దిగువేమి
వరుస లోకములు సర్వం విష్ణుమయము

చరణం:

చ : అచ్చమైన ఙ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చర తనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికీ దాసుడైతే
హెచ్చుకుందేమిలేదు ఏలినవాడితడే

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం