సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏమి గలదిందు నెంతకాలంబైన
టైటిల్: ఏమి గలదిందు నెంతకాలంబైన
పల్లవి:
ఏమి గలదిందు నెంతకాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ
కొండవంటిది యాస, గోడవంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పూండువంటిది మేను, పోలించినను మేడి-
పండువంటిది సరసభావమింతియును
కంచువంటిది మనసు, కలిమిగల దింతయును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మేలింతయును ముట్టు
పెంచువంటిది, దీనిప్రియ మేమిబ్రా(తి
ఆ(కవంటిది జన్మ (ం)అడవి వంటిది చింత
పాకువంటిది కర్మబంధమెల్ల
యేకటను తిరువేంకటేశు(దలచిన కోర్కి
కాక(?) సౌఖ్యములున్న గనివంటి దరయ
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం