సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏమంటి వేమంటి
పల్లవి:

ప : ఏమంటి వేమంటి వెరగనేను - ఓ
కామిని నీకిప్పుడైన కానవచ్చెగా

చరణం:

చ : వేలతలుపు మీటిన విటుడెవ్వడే - ఓ
తాలిమి నేనే మాధవుడను
వాలిన మాధవుడవంటే వసంతుడవా - కాదే
గాలింపు చక్రముచేత కలవాడనే

చరణం:

చ : ధర చక్రివైతే కుమ్మరవాడవా - కాదే
సిరుల భూమి ధరించినవాడనే
శిరసున భూమిమోచే శేషుడవా - కాదే
అరయ నిన్నియునేలే హరినే నేను

చరణం:

చ : వంతులకు హరివైతే వానరమవా - నీ
మంతనపు లక్ష్మీ రమణుడనేను
ఇంతయేల శ్రీవేంకటేశుడ ననగరాదా - తొల్లి
అంతేపో నామారు నీవంటివిగదవే

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం