సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏపనులు సేసినా నిటువలెనేపో
పల్లవి:

ఏపనులు సేసినా నిటువలెనేపో |
యీపనికి జొరనిపని యేటిలోపైరు ||

చరణం:

హరికథలమీదిప్రియమబ్బేనా తొంటితమ- |
పరిపక్వమగుదపఃఫలముగాక ||
గరిమె నివిలేకున్న గలకాలములు జేయు- |
నిరతంపు దపమెల్ల నీటిపై వ్రాత ||

చరణం:

నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్ల |
బారజల్లిన దానఫల మదియపో |
కోరి యిది లేకున్న కోటిదానములైన |
పేరుకొన వరతగలపినచింతపండు ||

చరణం:

వదలకిటు వేంకటేశ్వరుడే దైవంబనుచు |
జదువగలిగిన మంచిచదు వదియపో |
పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను |
చదువు లసురలు మున్ను చదివేటిచదువు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం