సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏపురాణముల నెంత
టైటిల్: ఏపురాణముల నెంత
పల్లవి:
ఏపురాణముల నెంత వెదికినా
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||
వారివిరహితములు అవి గొన్నాళ్ళకు
విరసంబులు మరి విఫలములు
నరహరి గొలి చిటు నమ్మినవరములు
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
కమలాక్షుని మతిగాననిచదువులు
కుమతంబులు బహుకుపథములు
జమళి నచ్యుతుని సమారాధనలు
విమలములే కాని వితథముగావు ||
శ్రీవల్లభుగతి జేరనిపదవులు
దావతులు కపటధర్మములు
శ్రీవేంకటపతి సేవించునేవలు
పావనము లధికభాగ్యపుసిరులు ||