సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఏవీ నుపాయాలుగావు
టైటిల్: ఏవీ నుపాయాలుగావు
పల్లవి:
ప|| ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని | దావతి బడక యిది దక్కితే సులభము ||
చరణం:చ|| ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి | దంటవాయువు గెలువదలచేదెల్లా |
వెంటికవట్టుక పోయి వెస గొండ వాకుట | వెంట గర్మమార్గమున విష్ణుని సాధించుట ||
చ|| యేనుగుతో బెనగుట యిల నిరాహారియై | కాననిపంచేందిర్యాల గట్టబోవుట |
నానిం చినుపగుగిళ్ళు నమలుట బలిమిని | ధ్యానించి మనసుబట్టి దైవము సాధించుట ||
చ|| దప్పికి నెండమావులు దాగ దగ్గరబోవుట | తప్పుజదువులలో దత్త్వము నెంచుట |
పిప్పిచవి యడుగుట పెక్కుదైవాల గొలిచి | కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం