సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి
టైటిల్: ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి
పల్లవి:
ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి బత్తి
చిక్కంచే దెటువలెనే చేతిలోనికతని ||
మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు
చెనకే దెటువలెనే చెలువునిని
వనితరో పతి కొప్పొ వంగీనంటూ లోగేవు
పెనగే దెటువలెనే ప్రియమైన వేళను ||
వెంగెమవునో యనుచును వెస నవ్వజాల్వు
సంగతయ్యే దెటులనే సరసములు
యెంగిలయ్యీ నంటామోవి యించుకంతా నడుగవు
ముంగిట రతులనింక ముందెటువలెనే ||
సిగ్గువడీనో యంటా చెరగుపట్టి తియ్యపు
వెగ్గళించే దెట్టే శ్రీ వేంకటేశుని
యెగ్గు వట్టీనోయంటా నిట్టెగోరు దాకించేవు
వొగ్గి కూడితివి యిట్టే వుబ్బుతెలిసే దెట్టే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం