సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎందు జూచిన దనకు
పల్లవి:

ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే
కందులేనిసుఖము కలనైన లేదు ||

చరణం:

సిరులుగలిగినఫలము చింత బొరలనె కాని
సొరిది సంతోష మించుకైన లేదు
తరుణిగలఫలము వేదనల బొరలుటె కాని
నెరసులేనిసుఖము నిమిషంబు లేదు ||

చరణం:

తనువుగలఫలము పాతకముసేయనె కాని
అనువైనపుణ్యంబు అది యింత లేదు
మనసుగలఫలము దుర్మతిబొందనే కాని
ఘనమనోజ్ఞానసంగతి గొంత లేదు ||

చరణం:

చదువుగలిగినఫలము సంశయంబే కాని
సదమలజ్ఞాననిశ్చయ మింత లేదు
యిది యెరిగి తిరువేంకటేశ్వరుని గొలిచినను
బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం