సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎన్నడు విజ్ఞానమిక నాకు
పల్లవి:

ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీవేంకాటనాథ ||

చరణం:

బాసిన బాయవు భవబంధములు
ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||

చరణం:

కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||

చరణం:

ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం