సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎంత జాణరో యీకలికి
పల్లవి:

ఎంత జాణరో యీకలికి
కాంతుడ నీ భోగములకే తగునూ ||

చరణం:

చెలి నీ కౌగిట చెమటలజేసెను
చలువగ నిప్పుడు జలకేళి
అలరుచు గుచముల నదుముచు జేసెను
పలుమరు ముదముల బర్వతకేళి ||

చరణం:

పైపై బెనగుచు బాహులతలనే
వైపుగ జేసెను వనకేళి
చూపుల నీపయి సొలయుచు జేసెను
పూప వసంతము పూవులకేళి ||

చరణం:

అరుదుగ నట్టివి యధరామృతముల
సరిజేసెను భోజనకేళి
కరగుచు శ్రీవేంకటేశ సేసేను
పరగిన రతులనె పరిణయ కేళి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం