సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క
పల్లవి:

ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క
గట్టిగా నిందుకే హరి కడుమెచ్చేమయ్యా // పల్లవి //

చరణం:

గరుడునిమీఁదెక్కి గమనించితివి నాఁడు
అరుదైన పారిజాతహరణానకు
గరిమతో రథమెక్కి కదలితి వల్లనాఁడు
సొరిది బ్రాహ్మణపడుచుల నుద్ధరించను // ఎట్టు //

చరణం:

చక్కఁగాఁ గుబేరుని పుష్పక మెక్కి కదలితి
మక్కువ సీతాదేవి మరలించను
తక్కక వాయుజు నెక్కి దాడివెటితివి నాఁడు
చొక్కపువానరులపౌఁజులు చూడను // ఎట్టు //

చరణం:

కొట్టఁగొన నీవు రాతిగుఱ్ఱము నెక్కి తోలితి -
పట్టియెడ నధర్మము నడఁచఁగను
మెట్టుక శ్రీవేంకటేశమీఁదఁ బల్లకి యెక్కితి -
విట్టె యిందిరఁ గూడి యేఁగుఁబెండ్లి యేఁగును // ఎట్టు //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం