సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎవ్వరి గాదన్న నిది
పల్లవి:

ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట
యెవ్వరి గొలిచిన నిది నీకొలువు ||

చరణం:

అవయవములలో నది గాదిది గా
దని మేలివి మేలన నేలా
భువియు బాతాళము దివియు నందలి జంతు
నివహ మింతయునూ నీదేహమేకాన ||

చరణం:

నీవు లేనిచోటు నిజముగ దెలిపిన
ఆవల నది గాదనవచ్చును
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము
భావింప నీవే పరిపూర్ణుడవుగాన ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం