సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: గాలినే పోయ
టైటిల్: గాలినే పోయ
పల్లవి:
ప|| గాలినే పోయ గలకాలము | తాలిమికి గొంతయు బొద్దులేదు ||
చరణం:చ|| అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు | గుడుగుకొననే పట్టె గలకాలము |
ఒడలికి జీవుని కొడయడైనహరి | దడవగా గొంతయు బొద్దులేదు ||
చ|| కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె | కలుషదేహపుబాధ గలకాలము |
తలపోసి తనపాలి దైవమైన హరి | దలచగా గొంతయు బొద్దులేదు |
చ|| శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె | గరిమల గపటాల గలకాలము |
తిరువేంకటగిరి దేవుడైనహరి | దరిచేరా గొంతయు బొద్దులేదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం