సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: గడ్డపార మింగితే నాకలి
టైటిల్: గడ్డపార మింగితే నాకలి
పల్లవి:
ప|| గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ- | వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక ||
చరణం:చ|| చించుక మిన్నులబారే చింకలను బండిగట్టి | వంచుకొనేమన్న నవి వశమయ్యేనా |
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు | పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక ||
చ|| మంటమండేయగ్గి దెచ్చి మసిపాత మూటగట్టి | యింటిలోపల దాచుకొన్న నితవయ్యీనా ||
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు | బంటుజేసి ఆసలనే పారదోసుగాక ||
చ|| పట్టరాని విషములపాము దెచ్చి తలకింద | బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా |
వెట్టసంసారమిది వేంకటేశు గొలువని- | వట్టిమనుజుల పెడవాడ బెట్టుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం