సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: గద్దరి జీవుడు
టైటిల్: గద్దరి జీవుడు
పల్లవి:
ప|| గద్దరి జీవుడు కామధేనువు మాని | యెద్దు బిదుక జొచ్చె నేది దెరగు ||
చరణం:చ|| మట మాయముల దనమనసె చంచలమంది | ఇటినటు దిరిగిన నేది దెరగు |
కట కట వూరేలు కర్తే దొంగలగూడి | యెటువలె జేసిన నేది దెరగు ||
చ|| కల్లలాడగ జొచ్చె గలుషపు మతి సత్య | మిల్లు వెడలగొట్టె నేది దెరగు |
చెల్లబో నోరే చేదు మేయగ జొచ్చె | నెల్లవారికి నింకనేది దెరగు ||
చ|| తియ్యని వేంకటాధిపు బాసి పరసేవ | కియ్య కొనెడి జిత్తమేది దెరగు |
అయ్యొ చక్కని బతినాలు విడిచిపోయి | యెయ్యెడ దిరిగిన నేది దెరగు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం